ముంబై, సెప్టెంబర్ 14 (నమస్తే తెలంగాణ): భోపాల్‌లో 90 డిగ్రీల మలుపు వంతెన సోషల్ మీడియాలో ఎంతగానో ట్రోల్ అయ్యింది. తాజాగా నాగ్‌పూర్‌లో ఇలాంటి వింత నిర్మాణం వెలుగులోకి వచ్చింది. దిఘోరి-ఇండోరా మార్గంలో రూ.998 కోట్ల వ్యయంతో ఎన్హెచ్ఎంఐ నిర్మిస్తున్న ఫె ్ల ఓవర్ వంతెన ప్రవీణ్ పాత్రె అనే వ్యక్తికి చెందిన రెండంతస్తుల ఇంట్లోని బాల్కనీలోకి చొచ్చుకుపోయింది.
ఈ వంతెన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత, ప్రజలు నాగ్‌పూర్ మున్సిపల్ కార్పొరేషన్‌ను సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. దీనిపై మున్సిపల్ కార్పొరేషన్ స్పందిస్తూ ఆ ఇంటి యజమాని తన ప్లాట్ సరిహద్దులు దాటి బాలనీని నిర్మించాడని, అతి త్వరలో బాలనీని కూల్చివేస్తామని తెలిపింది. ఆమోదించిన డిజైన్ ప్రకారం ఫ్లై ఓవర్ నిర్మాణం జరుగుతున్నదని అధికారులు పేర్కొన్నారు. ఆ ఇంటిని అనుమతి లేకుండా నిర్మించారని మున్సిపల్ కమిషనర్ నరేంద్ర బవాంకర్ తెలిపారు.