థానె: నిండా పదేండ్లు కూడా నిండలేదు. పక్కింటి అమ్మాయిపై దారుణానికి ఒడిగట్టాడు. తొమ్మిదేండ్ల అబ్బాయి.. నాలుగున్నరేండ్ల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన మహారాష్ట్రలోని థానె జిల్లాలో చోటుచేసుకుంది.
థానె జిల్లాలోని ఉల్హాస్నగర్ టౌన్లో తొమ్మిదేండ్ల అబ్బాయి.. ఈ నెల 3న తన పక్కింట్లో ఉంటున్న నాలుగేండ్ల చిన్నారిని ఆడుకుందామని ఏవరూ లేని ప్రదేశానికి తీసుకెళ్లాడు. అనంతరం ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అయితే రహస్య భాగాల్లో నొప్పిగా ఉందని ఆ చిన్నారి తన తల్లికి చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడిపై పోస్కో చట్టం, 376 (రేప్) సెక్షన్ కింద కేసు నమోదుచేశారు. కాగా, ఆ అబ్బాయిని ఇంకా అదుపులోకి తీసుకోలేదని పోలీసులు తెలిపారు.