కృష్ణగిరి, ఆగస్టు 25: తమిళనాడు కృష్ణగిరి జిల్లాలోని ఓ జాతీయ రహదారిపై 9 వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఆదివారం సాయంత్రం జరిగిన ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా, మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హోసూర్-బెంగళూరు హైవేపై సవమవు అటవీ ప్రాంతం సమీపంలో ఫ్లైఓవర్ పనుల కారణంగా హోసూర్ నుంచి క్రిష్ణగిరి వెళ్తున్న వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. ఈ క్రమంలో గ్రానైట్ లోడుతో వెళ్తున్న లారీ డ్రైవర్ వాహనంపై అదుపుకోల్పోయి నాలుగు కార్లు, మూడు ట్రక్కులు, ఓ బస్సును ఢీకొట్టాడు.