Bihar | బీహార్‌లో ఘోర ప్రమాదం.. కారు, బైకు, లారీ ఢీకొని తొమ్మిది మంది దుర్మరణం
బీహార్‌లోని (Bihar) కైమూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Accident) జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు సహా తొమ్మిది మంది మరణించారు. ఎనిమిది ప్రయాణికులతో ససారామ్ నుంచి వారణాసి వెళ్తున్న ఓ కారు.. దేవ్‌కాళి గ్రామం వద్ద జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది.
పాట్నా: బీహార్‌లోని (Bihar) కైమూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Accident) జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు సహా తొమ్మిది మంది మరణించారు. ఎనిమిది ప్రయాణికులతో ససారామ్ నుంచి వారణాసి వెళ్తున్న ఓ కారు.. దేవ్‌కాళి గ్రామం వద్ద జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. అనంతరం రెండు వాహనాలు అదుపుతప్పి మరో మార్గంలోకి వెళ్లాయి. అయితే ఎదురుగా వస్తున్న ట్రక్కు వాటిని గుద్దింది. జీపులో ఉన్న ఎనిమిది మందితోపాటు బైక్‌పై వెళ్తున్న వ్యక్తి దుర్మరణం చెందారు.
దీంతో ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతులను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు. కాగా, ప్రమాదం అనంతరం లారీ డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడని, అతని కోసం గాలిస్తున్నామని చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Guidance Tamil Nadu | ‘పెట్టుబడుల’ లీక్‌పై రాజకీయ ప్రకంపనలు.. ఏపీ, తమిళనాడు మధ్య వివాదం ముదురుతోందా?
Rajasthan Elections | రాజస్థాన్‌లో బీజేపీకి ఘోర పరాభవం.. పంచాయతీ, పరిషత్ ఎన్నికల్లో 70% సీట్లలో పరాజయం
Raja Gopal Reddy | రాజగోపాల్‌రెడ్డికి హైకమాండ్ పిలుపు.. 23న ఏం జరగబోతున్నది?
Gurukul Teachers | ఒక్కో గురుకులంలో ఒక్కో వేతనం.. పార్ట్‌టైమ్ టీచర్లకు అన్యాయం!
గ్రామ స్వరాజ్యానికి గ్రహణం.. ఆర్థికంగా కుదేలైన తెలంగాణ పంచాయతీలు.. ఆర్బీఐ నివేదికలో జీపీల దుస్థితి బట్టబయలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

