Death Sentence: కస్టడీ డెత్ కేసులో 9 మంది పోలీసులకు మరణశిక్ష
Death Sentence : కరోనా లాక్డౌన్ సమయంలో తమిళనాడులోని సాతంకులంలో జరిగిన కస్టడీ డెత్ కేసులో 9 మంది పోలీసులకు మధురై ప్రత్యేక కోర్టు మరణశిక్ష విధించింది. 2020లో ఈ ఘటన జరిగిన విషయం తెలిసిందే. నిందితుల్లో శ్రీధర్‌కు 15 లక్షల పెనాల్టీ కూడా విధించారు.
చెన్నై: కరోనా లాక్డౌన్ సమయంలో తమిళనాడులోని సాతంకులంలో జరిగిన కస్టడీ డెత్ కేసులో 9 మంది పోలీసులకు మధురై కోర్టు మరణశిక్ష(Death Sentence) విధించింది. 2020లో ఈ ఘటన జరిగిన విషయం తెలిసిందే. ఆ కేసులో ప్రత్యేక కోర్టు ఇవాళ తీర్పును వెలువరించింది. నిందితుల్లో శ్రీధర్, రఘుగణేశ్, మురుగన్, బాలకృష్ణన్, ముత్తురాజ్, చెల్లాదురై, థోమన్ ఫ్రాన్సిస్, సముదురై, వేయిల్ముత్తు ఉన్నారు. శ్రీధర్‌కు 15 లక్షల పెనాల్టీ కూడా విధించారు. తండ్రి జయ్‌రాజ్, కుమారుడు బెన్నిక్స్.. ఓ మొబైల్ షాపు నడుపుతున్నారు.
అయితే లాక్డౌన్ సమయంలో గడువు ముగిసిన తర్వాత కూడా షాపును ఓపెన్ చేసిన కేసులో జూన్ 19, 2020న వాళ్లను అరెస్టు చేశారు. రాత్రంతా తండ్రీకొడుకుల్ని పోలీసులు తీవ్రంగా చిత్రహింస పెట్టారు. ఆ తర్వాత కోవిల్పట్టి సబ్‌జైల్‌కు పంపారు. సాతంకులం పోలీస్ స్టేషన్లో బాధితులను చిత్రహింస పెట్టినట్లు సీబీఐ దాఖలు చేసిన కేసును కోర్టు ఆమోదించింది. కర్రలు, ఇనుప రాడ్లతో కొట్టడం వల్ల ఆ ఇద్దరూ మరణించినట్లు పోస్టుమార్టమ్‌లో తేలింది. నిందిత పోలీసులు కేసులో తప్పుడు రికార్డులు సృష్టించే ప్రయత్నం చేశారని, దర్యాప్తును అడ్డుకునేందుకు చూశారని ప్రత్యేక కోర్టు చెప్పింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJI Surya Kant: మీటింగ్ కుదరదు.. ఈ-ఫైలింగ్ చేయండి: ఖర్గే, రాహుల్‌కు సీజేఐ లేఖ
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
Jantar Mantar | జంతర్ మంతర్ ఇకపై నిరసన వేదిక కాదు.. నిరసనల కోసం మూడు కొత్త ప్రాంతాలు
Pakistan | పాక్‌లో ముదురుతున్న రాజకీయ సంక్షోభం.. ఖైబర్ పఖ్తున్ఖ్వా గవర్నర్ ఇంటికి నిప్పు..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

