ముంబై, మే 12: ఐటీ రంగం కుదేలవుతున్న తరణంలో, లే ఆఫ్‌లతో పెద్ద సంఖ్యలో ఉద్యోగుల్ని తొలగిస్తున్నవేళ.. ఇంజనీరింగ్ గ్రాడ్యుయెట్స్కు ఎస్బీఐ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2024-25) ప్రొబేషనరీ ఆఫీసర్లు (పీవో), అసోసియేట్స్‌గా ఎస్బీఐ 12వేల మంది (85శాతం) ఇంజనీరింగ్ ఫ్రెషర్స్‌తో నియామకం చేపడుతున్నట్టు బ్యాంక్ చైర్మన్ దినేశ్ ఖారా చెప్పారు. శిక్షణ అనంతరం 3 వేల మంది పీవో, 8 వేల మంది అసోసియేట్స్‌ను బ్యాంక్ వ్యాపారం, ఐటీ విధుల్లో నియమిస్తామని అన్నారు. ‘టెక్ మ్యాన్ పవర్ సరఫరా బ్యాంక్‌కు నిరంతరం ఉండేట్టు ఇది దోహదపడుతుంది’ అని దినేశ్ ఖారా వివరించారు.