CM Stalin | చెన్నై: సింధు లోయ నాగరికత లిపి శతాబ్ద కాలానికి పైగా అంతుచిక్కని చిక్కుముడిగానే మిగిలిపోయిందని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ వ్యాఖ్యానించారు. ఆ లిపిని అనువదించిన వారికి రూ.85 లక్షల (10 లక్షల డాలర్లు) బహుమానాన్ని అందచేస్తానని ఆయన ప్రకటించారు.
సింధు లోయ నాగరికతను కనుగొని వందేళ్లు గడచిన సందర్భంగా ఆదివారం మూడు రోజుల అంతర్జాతీయ సదస్సును స్టాలిన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ ఒకప్పుడు గొప్ప నాగరికతగా విరాజిల్లిన సింధు లోయ నాగరికతకు సంబంధించిన లిపిని ఇప్పటికీ అర్థం చేసుకోవడం మనకు సాధ్యం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.