IITs| ఐఐటీల నుంచి ఐదేండ్లలో 8 వేల మంది విద్యార్థుల డ్రాపౌట్.. కేంద్రం వెల్లడి
న్యూఢిల్లీ: గత ఐదేండ్లలో ఏకంగా 8 వేల మందికిపైగా విద్యార్థులు ఐఐటీల నుంచి డ్రాపౌట్ అయినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. రాజ్యసభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి సుభాష్ సర్కార్ఈ మేరకు రాతపూర్వక సమాధానమిచ్చారు.
IITs| న్యూఢిల్లీ: దేశంలో ప్రతిష్టాత్మక విద్యాసంస్థలైన ఐఐటీల్లో ప్రవేశం పొందేందుకు ఏటా వేల మంది విద్యార్థులు పోటీపడుతుంటారు. అయితే గత ఐదేండ్లలో ఏకంగా 8 వేల మందికిపైగా విద్యార్థులు ఐఐటీల నుంచి డ్రాపౌట్ అయినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. రాజ్యసభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి సుభాష్ సర్కార్ఈ మేరకు రాతపూర్వక సమాధానమిచ్చారు. మొత్తంగా ఉన్నత విద్యాసంస్థల నుంచి 32 వేల మందికిపైగా విద్యార్థులు డ్రాపౌట్ అయినట్టు చెప్పారు. కేంద్ర విశ్వవిద్యాలయాల నుంచి 17,454 మంది, ఐఐటీల్లో 8,139, ఎన్ఐటీల్లో 5,623, ఐఐఎస్ఈఆర్ నుంచి 1046, ఐఐఎంల నుంచి 858 మంది డ్రాపౌట్ అయినట్టు చెప్పారు. వీరిలో 52 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వారేనని తెలిపారు.
గత ఐదేండ్లలో ఐఐటీల్లో 39 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నట్టు కేంద్ర మంత్రి తెలిపారు. మొత్తంగా ఉన్నత విద్యాసంస్థల్లో 98 మంది బలవన్మరణానికి పాల్పడినట్టు చెప్పారు. ఐఐటీల (39) తర్వాత ఎన్ఐటీ(25), కేంద్ర విశ్వవిద్యాలయాలు (25), ఐఐఎం(4)లలో ఎక్కువ మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నట్టు పేర్కొన్నారు. ఒంటరిగా ఫీలవడం, హింస, కుటుంబ సమస్యలు, మానసిక రుగ్మతలు తదితర కారణాల వల్ల విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడినట్టు తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA Sudheer Reddy | జైపాల్ రెడ్డిపై లేని ప్రేమంతా ఒలకబోస్తున్న రేవంత్ రెడ్డి : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
Road Accident | డివైడర్ను ఢీకొన్న బైక్.. ఇద్దరు మృతి
చెకుముకి సైన్స్ సంబురాలు-2026 పోస్టర్ ఆవిష్కరణ
Narnoor | గోవర్ధన్ గుట్టపై ఆదివాసుల సాంప్రదాయ పూజలు
Women Professor | వీసీ అల్డాస్ జానయ్య వేధింపులకు మరో మహిళా ప్రొఫెసర్ కంటతడి.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

