న్యూఢిల్లీ: భారతీయ విద్యార్థులకు అమెరికా తలుపులు మూసేసినట్టుగానే కెనడా కూడా భారత విద్యార్థుల ఆశలపై నీళ్లు చల్లుతున్నది. ఈ ఏడాది ఇప్పటి వరకు భారతీయ విద్యార్థుల వీసా దరఖాస్తుల్లో 80% తిరస్కరించింది. ఇది గత పదేండ్లలోనే అత్యధికం కావడం గమనార్హం. ఈ గణాంకాలను స్వయంగా కెనడా ప్రభుత్వమే వెల్లడించింది.
దేశీయంగా ఉన్న గృహాల కొరత, పెరుగుతున్న జనాభా, మౌలిక సదుపాయాలపై ఒత్తిడి వంటివి ఇందుకు ప్రధాన కారణాలుగా చెప్తున్నది. కెనడాలోని కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో చదువుకోవాలనే భారతీయ విద్యార్థుల కలలు ఈ కఠిన నిబంధనల వల్ల చెదిరిపోతున్నాయి.