Cyber Crime | న్యూఢిల్లీ: దేశంలో నమోదవుతున్న సైబర్ నేరాల్లో దాదాపు 80 శాతం వరకు పది జిల్లాల్లోనే జరుగుతున్నట్లు ఫ్యూచర్ క్రైమ్ రిసెర్చ్ ఫౌండేషన్ (ఎఫ్‌సీఆర్‌ఎఫ్) నివేదిక వెల్లడించింది.
భరత్పూర్ (18 శాతం), మథుర (12 శాతం), నుహ్ (11 శాతం), దేవ్‌గఢ్ (10 శాతం), జామ్‌తార (9.6 శాతం), గురుగ్రామ్ (8.1 శాతం), ఆళ్వార్ (5.1 శాతం), బొకారో (2.4 శాతం), కర్మటాండ్ (2.4 శాతం), గిరిఢి (2.3 శాతం) సైబర్ నేరాలకు టాప్ టెన్ హాట్స్పాట్లని తెలిపింది.