బెంగళూరు: ఆన్ డిమాండ్ లాజిస్టిక్స్ ప్లాట్ఫాం పోర్టర్ కొందరు ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించింది. ఖర్చుల తగ్గింపు, కార్యకలాపాలను బలోపేతం చేయడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
పటిష్టమైన, మరింత చురుకైన, ఆర్థికంగా స్థిరత్వం కలిగిన సంస్థను నిర్మించడమే లక్ష్యంగా ప్రస్తుతం పరివర్తన దశలో ఉన్నామని, జాగ్రత్తగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నామని ఈ కంపెనీ తెలిపింది. మీడియా కథనాల ప్రకారం, ఈ కంపెనీ దాదాపు 350 మంది ఉద్యోగులను తొలగించింది.