Ayodhya Ram Temple: అయోధ్య రామాలయ విరాళాల వివాదం.. ఎఫ్ఐఆర్లోని 8 మంది నిందితులు అరెస్టు
Ayodhya Ram Temple: అయోధ్య రామాలయానికి విరాళంగా వచ్చిన సుమారు రూ.7.5 కోట్లు అదృశ్యమయ్యాయి. ఆ కేసులో 8 మందిని అరెస్టు చేసినట్లు అధికారులు చెప్పారు. సిట్ ఇచ్చిన నివేదిక ఆధారంగా అరెస్టు జరిగింది. నిందితులపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
అయోధ్య: అయోధ్య రామాలయ(Ayodhya Ram Temple) నిధులను దుర్వినియోగం చేసినట్లు నమోదు అయిన కేసులో 8 మందిని అరెస్టు చేసినట్లు సీనియర్ అధికారులు వెల్లడించారు. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు సభ్యుడు కృష్ణ మోహన్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసులో యూపీ సర్కారు ఏర్పాటు చేసిన సిట్ కూడా దర్యాప్తు చేపట్టింది. అయితే ఎఫ్ఐఆర్లో ఉన్న 8 మందిని గురువారం రాత్రి అరెస్టు చేసినట్లు ఇవాళ అధికారులు వెల్లడించారు. ఆలయానికి వచ్చిన విరాళాలను దుర్వినియోగం చేసినట్లు వారిపై ఆరోపణలు ఉన్నాయి.
అవనాశ్ శుక్లా, అనుకల్ప్ మిశ్రా, లవకుశ్ మిశ్రా, మనీశ్ కుమార్ యాదవ్, కరుణేశ్ పాండే, రామశంకర్ మిశ్రా, సుభాస్ శ్రీవాత్సవ్, రామశంకర్ యాదవ్ అలియాస్ టిన్ను ఆ జాబితాలో ఉన్నారు. రామాలయానికి విరాళాల రూపంలో అందే నగదు, విలువైన వస్తువులను లెక్కించే ప్రక్రియలో ఆ 8 మంది ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. అందరూ అయోధ్యలోనే ఉన్నారని, వారిని అదుపులోకి తీసుకున్నామని, వారిని విచారిస్తున్నామని, మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నట్లు ఓ సీనియర్ అధికారి చెప్పారు.
భారతీయ న్యాయ సంహితలోని 306(ప్రాపర్టీ చోరీ) 316(విశ్వాస ఘాతుకం), 317(ఎత్తుకెళ్లిన చోరీని దాచిపెట్టడం), 61(నేరపూరిత కుట్ర) లాంటి సెక్షన్ల కింద కేసును రిజిస్టర్ చేశారు. శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర సూచన మేరకు యూపీ సర్కారు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌ను ఏర్పాటు చేసింది. 23వ తేదీన ఆ కమిటీ తన రిపోర్టును అందజేసింది. ఇక జూన్ 25వ తేదీన సిట్ ప్రతిపాదనల ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. రామాలయానికి విరాళంగా వచ్చిన సుమారు 7.5 కోట్లు అదృశ్యమైనట్లు గుర్తించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Ayodhya
- Donations
- embezzlement
- FIR
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | రణబాలి ట్విట్టర్ రివ్యూ.. విజయ్ దేవరకొండ నటనకు ప్రశంసలు, కథనంపై మిశ్రమ స్పందన!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలిని, రోహిత్ మధ్య బ్రేకప్ వార్.. టాస్క్‌లో ఓటమితో వంశీ కన్నీళ్లు!
Caller ID | కాలర్ పేరు ప్రదర్శించడం తప్పనిసరి.. టెలికం కంపెనీలకు కేంద్రం ఆదేశం
Paper Leak | 8 ఏండ్లుగా పేపర్ లీక్‌లే లేవట.. NTAపై కేంద్ర విద్యా శాఖ నివేదిక
Reservations | మతం మారితే రిజర్వేషన్ వర్తించదు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

