న్యూఢిల్లీ, డిసెంబర్ 14: ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకు గత ఏడేండ్లలో 8,81,254 మంది భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకున్నారని కేంద్ర ప్రభుత్వం మంగళవారం లోక్సభకు తెలిపింది. గత ఏడేండ్లలో చూసుకుంటే ఒక ఏడాదిలో పౌరసత్వాన్ని వదులుకున్న వారి సంఖ్య 2019లో అత్యధికంగా 1,44,017గా ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ ఓ ప్రశ్నకు సమాధానంగా పేర్కొన్నారు.