న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని రాజ్పథ్పై భారత ఆయుధ సత్తా వెలిగిపోయింది. గణతంత్య్ర దినోత్సవ పరేడ్లో రక్షణ దళాలు తమ సామర్ధ్యాన్ని ప్రదర్శించాయి. మార్చింగ్లో పాల్గొన్న వివిధ దళాలు తమ ఆయుధాలను ప్రదర్శించాయి. ఈ నేపథ్యంలోనే స్వదేశీయంగా అభివృద్ధి చేసిన 75/24 పాక్ హోవిజ్జర్ ఎంకే గన్ను పరేడ్లో ప్రదర్శించారు. హోవిజ్జర్ గన్ వ్యవస్థను ఇండియా స్వయంగా డెవలప్ చేసింది. ఇతర ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల సహకారంతో ఏఆర్డీఈ సంస్థ దీన్ని తయారు చేసింది. ఇది లైట్ వెయిట్ గన్. పర్వత శ్రేణుల్లో ఈ ఆయుధం కీలకంగా పనిచేయనున్నది. స్వదేశీ పరిజ్ఞానంతో డెవలప్ చేసిన తొలి ఆర్టిల్లరీ గన్ సిస్టమ్ ఇది.
WATCH: 15 Meter Sarvatra Bridge System led by Lieutenant Depanshu Laller in the Republic Day Parade at the Rajpath in Delhi.#RepublicDayWithDoordarshan
— Prasar Bharati News Services पी.बी.एन.एस. (@PBNS_India) January 26, 2022
LIVE: https://t.co/83FcNn3Ny7 pic.twitter.com/sDl6Oc0JMW
ఈ పరేడ్లో సెంచూరియన్ ట్యాంక్, పీటీ-76, ఎంబీటీ అర్జున్ ఎంకే-1, ఏపీసీ టోపాల్ ఆయుధాలను కూడా ప్రదర్శించారు. వివిధ రెజిమెంట్లు కూడా పరేడ్లో మార్చింగ్ నిర్వహించాయి.
ICV BMP- II led by Lt. Rushikesh Sarda in the Republic Day Parade at the Rajpath in Delhi.#RepublicDayWithDoordarshan
— Prasar Bharati News Services पी.बी.एन.एस. (@PBNS_India) January 26, 2022
LIVE: https://t.co/83FcNn3fIz pic.twitter.com/4tlTZcBC5o