న్యూఢిల్లీ, ఫిబ్రవరి 6: 2018-22 మధ్య కాలంలో దేశంలో 701 దేశ ద్రోహం, 5,023 చట్ట వ్యతిరేక కార్యకలాపాలు(నిరోధం) చట్టం(ఉపా) కేసులు నమోదయ్యాయి. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ మంగళవారం లోక్‌సభలో ఒక ప్రశ్నకు సమాధానంగా ఈ వివరాలు వెల్లడించారు.
2021లో 149 దేశ ద్రోహం కేసులు నమోదు కాగా 2022లో 68 నమోదయ్యాయని తెలిపారు. ఈ కేసుల్లో 788 మందిని అరెస్ట్ చేసి 500 మందిపై చార్జ్‌షీట్ దాఖలు చేశారు. 131 మందిని నిర్దోషులుగా విడిచిపెట్టారు.