రహస్యంగా కోడల్ని పెళ్లాడిన 70 ఏళ్ల వృద్ధుడు.. ఎందుకంటే?
కైలాష్ మూడో కుమారుడు కొన్నేళ్ల కిందట మరణించాడు. దీంతో వితంతువైన కోడలు పూజాకు మరో వ్యక్తితో రెండో పెళ్లి జరిపించాడు. అయితే రెండో భర్తతో కలిసి ఆమె ఉండలేకపోయింది. మామ కైలాష్ యాదవ్ ఇంటికి ఆమె తిరిగి వచ్చింది. కొంత కాలంగా ఆ ఇంట్లోనే ఉంటున్నది.
లక్నో: ఒక వృద్ధుడు రహస్యంగా తన కోడల్ని పెళ్లి చేసుకున్నాడు. ఆ ఫొటో బయటపడటంతో ఆ ఊరి వారితోపాటు పోలీసులకు కూడా ఈ సంగతి తెలిసింది. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఛపియా ఉమారో గ్రామానికి చెందిన 70 ఏళ్ల కైలాష్ యాదవ్, బర్హల్‌గంజ్ పోలీస్ స్టేషన్లో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. 12 ఏళ్ల కిందట అతడి భార్య చనిపోయింది. కైలాష్ మూడో కుమారుడు కూడా కొన్నేళ్ల కిందట మరణించాడు. దీంతో వితంతువైన కోడలు పూజాకు మరో వ్యక్తితో రెండో పెళ్లి జరిపించాడు. అయితే రెండో భర్తతో కలిసి ఆమె ఉండలేకపోయింది. మామ కైలాష్ యాదవ్ ఇంటికి తిరిగి వచ్చింది. కొంత కాలంగా ఆ ఇంట్లోనే ఆమె ఉంటున్నది.
కాగా, కైలాష్ యాదవ్ ఇటీవల కోడలు పూజాను గుట్టుగా పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం ఎవరికీ చెప్పలేదు. అయితే వారిద్దరూ దండలు మార్చుకుని రహస్యంగా పెళ్లి చేసుకున్న ఫొటో ఒకటి ఇటీవల బయటకు వచ్చింది. దీంతో ఈ సంగతి తెలిసి ఇరుగుపొరుగు వారితోపాటు ఆ గ్రామ ప్రజలు విస్తూపోయారు.
మరోవైపు కైలాష్ యాదవ్ వాచ్‌మెన్‌గా పని చేసే పోలీస్ స్టేషన్‌లోని పోలీసులకు కూడా ఈ విషయం తెలిసింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ ఫొటో తన దృష్టికి వచ్చినట్లు పోలీస్ అధికారి జేఎన్ శుక్లా తెలిపారు. దీనిపై ఆరా తీస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

