బీదర్: కర్ణాటకలోని బీదర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత బీదర్‌లోని బెమలఖేడా ప్రభుత్వ స్కూలు వద్ద ఆటోను లారీ ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఏడుగురు మహిళలు అక్కడికక్కడే మృతించారు. మరో 11 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. గాయపడిన వారిలో రెండు వాహనాల డ్రైవర్లు కూడా ఉన్నారని తెలిపారు. ఆటోలో ప్రయాణిస్తున్నవారంతా కూలీలని, పనులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.