గుడిసెలో చెలరేగిన మంటలు.. ఏడుగురు సజీవదహనం
Ludhiana | పంజాబ్‌లోని లూథియానాలో (Ludhiana ) ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు సజీవ దహనమయ్యారు. బుధవారం తెల్లవారుజామున లూథియానాలోని
అమృత్సర్: పంజాబ్‌లోని లూథియానాలో (Ludhiana ) ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు సజీవ దహనమయ్యారు. బుధవారం తెల్లవారుజామున లూథియానాలోని టిబ్బా రోడ్డులోని మున్సిపల్ చెత్త డంప్‌యార్డ్ సమీపంలో ఉన్న ఓ గుడిసెలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ఏడుగురు అగ్నికి ఆహుతయ్యారు. మృతుల్లో ఐదుగురు చిన్నారులు ఉన్నారని పోలీసులు తెలిపారు.
తల్లిదండ్రులు సహా ఐదుగురు చిన్నారులు తమ గుడిసెలో నిద్రిస్తుండగా అగ్నిప్రమాదం జరిగిందని లూథియానా అసిస్టెంట్ కమిషనర్ (ఈస్ట్) సురీందర్ సింగ్ తెలిపారు. వారంతా ఉపాధి కోసం లూథియానకు వలస కార్మికులని చెప్పారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని, మృతులను గుర్తించాల్సి ఉన్నదన్నారు. ఈఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.
Ludhiana
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్

