దేశ రాజధానిని భారీ వర్షాలు ముంచెత్తాయి. దీంతో ఢిల్లీ-గురుగ్రామ్ జాతీయ రహదారిపై 7 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనదారులు రోడ్లపై ముందుకు కదల్లేక మూడు గంటలపాటు నరకయాతన అనుభవించారు.
సోమవారం మధ్యాహ్నం 3 నుంచి 7 గంటలకు వరకు కురిసిన భారీ వర్షానికి, గురుగ్రామ్ సిటీలో రికార్డ్‌స్థాయిలో 100 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఢిల్లీలో జన జీవనం పూర్తిగా స్తంభించిపోయింది.