అహ్మదాబాద్: వేగంగా వెళ్తున్న రెండు కార్లు ఢీకొన్నాయి. (Cars Collide) సీఎన్జీతో నడిచే కారులోని సిలిండర్ పేలింది. దీంతో మంటలు చెలరేగాయి. రోడ్డు పక్కన ఉన్న గుడిసెలకు కూడా ఈ మంటలు వ్యాపించాయి. ఐదుగురు విద్యార్థులతో సహా ఏడుగురు వ్యక్తులు ఈ ప్రమాదంలో మరణించారు. గుజరాత్‌లోని జునాగఢ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. సోమవారం ఉదయం మలియా హతీనా గ్రామం సమీపంలోని జునాగఢ్-వెరావల్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డివైడర్‌కు సమీపంలో రోడ్డు క్రాస్ చేసిన ఒక కారు హైవేపై ఎదురుగా వస్తున్న కారును వేగంగా ఢీకొట్టింది. దీంతో సీఎన్జీతో నడిచే కారులోని గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ నేపథ్యంలో మంటలు చెలరేగాయి. రోడ్డు పక్కన ఉన్న గుడిసెలకు కూడా ఈ మంటలు వ్యాపించాయి.
కాగా, పరీక్ష కోసం వెళ్తున్న ఐదుగురు విద్యార్థులతో సహా ఏడుగురు వ్యక్తులు ఈ ప్రమాదంలో మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు, ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను ఆర్పివేశారు. ఏడుగురు మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అలాగే గాయపడిన ఇద్దరికి చికిత్స అందిస్తున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరోవైపు ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన ప్రమాదానికి సంబంధించిన వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ભંડુરી જીવલેણ અકસ્માતનાં CCTV આવ્યા સામે, જુઓ વાયરલ CCTV……#accident #highway #viralcctv #accidentcctv #junagadh #junagadhtourism #junagadhcity #junagadhdiaries #junagadhnews #veraval #veraval_city #veravalsomnath #nationalhighway #news #viral #instagram #shandarrajkot pic.twitter.com/WCNll03dfM
— Shandar Rajkot (@ShandaRajkot) December 9, 2024
જૂનાગઢ-વેરાવળ હાઈવે પર ગમખ્વાર અકસ્માત#Junagadh #Veravalhighway #Gamkhwar #accident #humdekhengenews pic.twitter.com/ZWHYrLFhic
— Hum Dekhenge News (@humdekhengenews) December 9, 2024