Rajya Sabha Elections | ఈ ఏడాది రాజ్యసభలో 68 స్థానాలు ఖాళీ..రిటైరయ్యే నేతలు వీరే..!
Rajya Sabha Elections | ఈ ఏడాది రాజ్యసభలో 68 మంది ఎంపీలు రిటైర్ కానున్నారు. తెలంగాణ నుంచి ముగ్గురు సభ్యుల పదవీ కాలం ముగియనున్నది.
Rajya Sabha Elections | తొమ్మిది మంది కేంద్ర మంత్రులు సహా ఈ ఏడాది 68 మంది రాజ్యసభ సభ్యుల పదవీ కాలం ముగియనున్నది. దీంతో దేశంలోని ప్రధాన పార్టీలన్నీ తమ బలాబలాలకు అనుగుణంగా రాజ్యసభ సీట్లు గెలుచుకునేందుకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఈ నెల 27న ఢిల్లీలోని మూడు స్థానాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆమ్ఆద్మీ పార్టీ (ఆప్) సభ్యులు సంజయ్ సింగ్, నారాయణ్ దాస్ గుప్తా, సుశీల్ కుమార్ గుప్తా, సిక్కింలోని ఎస్డీఎఫ్ సభ్యుడు హిషేయ్ లచ్చుంగ్ప స్థానాలకు ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ జారీ చేశారు. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, పర్యాటకశాఖ మంత్రి భూపేంద్ర యాదవ్, ఆరోగ్యశాఖ మంత్రి మాన్ సుఖ్ మాండవీయ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పదవీ కాలం ఈ ఏడాది ఏప్రిల్ తో ముగుస్తుంది.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అత్యధికంగా 10 సీట్లు, మహారాష్ట్ర, బీహర్ రాష్ట్రాల నుంచి ఆరేసీ సీట్లు, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఐదు సీట్ల చొప్పున, కర్ణాటక, గుజరాత్లలో నాలుగేసి సీట్లు, ఒడిశా, తెలంగాణ, కేరళల్లో మూడేసీ సీట్లు, జార్ఖండ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో రెండు, ఉత్తరాఖండ్, హిమాచల ప్రదేశ్, హర్యానా, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాల్లో ఒక్కో సీటు ఖాళీ అయ్యాయి. మరో నలుగురు నామినేటెడ్ సభ్యులు జూలైలో రిటైర్ అవుతారు.
హిమాచల్ ప్రదేశ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా.. బయటి రాష్ట్రం నుంచి ప్రాతినిధ్య వహించే అవకాశాలు ఉన్నాయి. గతేడాది గెలిచిన కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల నుంచి తమ సభ్యులను రాజ్యసభకు పంపాలని కాంగ్రెస్ భావిస్తున్నది. కర్ణాటకలో నాలుగు, తెలంగాణలో మూడు స్థానాలు ఖాళీ అవుతాయి.
మన్మోహన్ సింగ్, భూపేంద్ర యాదవ్ (రాజస్థాన్), అశ్వినీ వైష్ణవ్ (బీజేపీ), బీజేడీ సభయులు ప్రశాంత నందా, అమర్ పట్నాయక్ (ఒడిశా), బీజేపీ ప్రధాన అధికార ప్రతినిధి అనిల్ బాలుని (ఉత్తరాఖండ్), మాన్ సుఖ్ మాండవియా, పురుషోత్తం రూపాలా, కాంగ్రెస్ సభ్యులు నరంభాయి రథ్వా, యామీ యాగ్నిన్ (గుజరాత్) నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కేంద్ర మంత్రులు వీ మురళీధరన్, నారాయణ రాణె, కేంద్ర మాజీ మంత్రి ప్రకాశ్ జవదేకర్, కాంగ్రెస్ ఎంపీ కుమార్ కేట్కర్, ఎన్సీపీ నుంచి వందనా చవాన్, శివసేన (ఉద్దవ్ బాల్ ఠాక్రే) పార్టీ సభ్యుడు అనిల్ దేశాయి రిటైర్ అవుతారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Road Accident | ఆటో బోల్తా..ఐదుగురికి గాయాలు
Sensational Comments | రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు.. సోనియాగాంధీకి సీనియర్ నాయకుడు లేఖ
Protein Idly | ఇడ్లీలను ప్రోటీన్లు ఉండేలా ఆరోగ్యకరంగా ఇలా తయారు చేసుకోండి.. ఎంతో రుచిగా ఉంటాయి..
Promotions | టీజీఎస్ ఆర్టీసీ హైదరాబాద్ జోన్లో 63 మంది సిబ్బందికి పదోన్నతులు
‘ఏఐటీయూసీ జాతీయ మహాసభలను జయప్రదం చేయండి’
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

