శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. (Fire Breaks Out) ఒక గ్రామంలో సుమారు 68 ఇళ్లు దగ్ధమయ్యాయి. ఇళ్లు కాలిపోవడంతో నివాసితులు రోడ్డు పాలయ్యారు. స్పందించిన అధికారులు బాధితులకు తాత్కాలిక ఏర్పాట్లు చేశారు. మంగళవారం మధ్యాహ్నం కిష్త్వార్లోని ముల్వార్వాన్ గ్రామంలో మంటలు చెలరేగాయి. ఈ అగ్నిప్రమాదంలో 68 ఇళ్లు కాలిపోయాయి. దీంతో వందలాది నివాసితులు కట్టుబట్టలతో మిగిలారు. చలి వాతావరణం నేపథ్యంలో పిల్లలు, వృద్ధులు చాలా ఇబ్బందులు పడ్డారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని ఇళ్లు కోల్పోయిన బాధితులు కోరారు.
కాగా, ఈ సమాచారం తెలుసుకున్న అధికారులు స్పందించారు. అగ్నిప్రమాదంలో ఇళ్లు కోల్పోయిన వారికి తాత్కాలిక టెంట్లలో ఆశ్రయం కల్పించారు. బాధిత కుటుంబాలకు ఆహారం, దుస్తులు, వైద్య, సహాయక సామగ్రిని అందించినట్లు కిష్త్వార్ డిప్యూటీ కమిషనర్ రాజేష్ కుమార్ తెలిపారు. ఈ విషయం తెలిసిన వెంటనే విపత్తు నిర్వహణ బృందాలను సంఘటనా స్థలానికి పంపినట్లు చెప్పారు.
మరోవైపు ఈ అగ్నిప్రమాదంలో 40 ఇళ్ళు దెబ్బతిన్నట్లు తొలుత తెలిసిందని రాజేష్ కుమార్ తెలిపారు. అయితే మొత్తం 68 ఇళ్ళు కాలిపోయాయని చెప్పారు. బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయంతోపాటు పునరావాసాన్ని కల్పించే చర్యలు చేపడతామని వెల్లడించారు.
I am deeply saddened by the fire incident in Warwan, Kishtwar which has damaged over 70 houses, including a mosque. I urge the LG administration to provide immediate compensation on a fast-track basis, as there is already cold weather. A special package is essential to help… pic.twitter.com/ZSpgQcgVtm
— Ghulam Nabi Azad (@ghulamnazad) October 15, 2024
Seventy houses, including a Jamia Masjid, were destroyed in a devastating fire in Warwan, Kishtwar!
Kindly extend your support to the fire victims of Warwan, Kishtwar by contributing through Ababeel Doda, the most trusted NGO in the Chenab Valley!
Your generosity will provide… pic.twitter.com/9wFn96INyo
— Tahir Peerzada (@TahirPeerzada_) October 15, 2024