HomeNational67 Year Old Indore Woman Falls Prey To Digital Arrest Scam Loses Rs 30 Lakh
Digital Arrest: ఇండోర్‌లో డిజిటల్ అరెస్టు.. 30 లక్షలు కోల్పోయిన మహిళ
Digital Arrest: 67 ఏళ్ల మహిళ డిజిటల్ అరెస్టు స్కామ్‌కు గురైంది. సైబర్ నేరగాళ్ల వలలో పడిన ఆమె తన అకౌంట్ నుంచి 30 లక్షలు కోల్పోయింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరిగింది.
ఇండోర్: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన 67 ఏళ్ల మహిళ డిజిటల్ అరెస్టు(Digital Arrest) స్కామ్‌కు గురైంది. సైబర్ నేరగాళ్ల వలలో పడిన ఆమె తన అకౌంట్ నుంచి 30 లక్షలు కోల్పోయింది. ఈ విషయాన్ని క్రైం బ్రాంచ్ డీసీపీ రాజేశ్ దండోతియ్య తెలిపారు. జమ్మూకశ్మీర్‌లోని ఓ ఉగ్రవాద సంస్థ నుంచి తన అకౌంట్లోకి డబ్బులు ట్రాన్స్ఫర్ అయినట్లు సైబర్ నేరగాళ్లు ఆ మహిళను మోసం చేశారు. ఆమె అకౌంట్లో ఉన్న సుమారు 30 లక్షల డబ్బును చీట్ చేసి కాజేశారు. ఇటీవలే ఆమె అమెరికా వెళ్లి వచ్చింది. ఫ్రాడ్ కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.
నవంబ్ 23వ తేదీన ఆ మహిళకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. జమ్మూకశ్మీర్ నుంచి ఎస్పీ ఫోన్లో మాట్లాడుతున్నట్లు ఆమెకు చెప్పారు. ఉగ్రవాదుల నుంచి ఓ మొబైల్ సీజ్ చేశామని, ఆ ఫోన్ నుంచి సుమారు 2300 కోట్లు అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అయినట్లు ఆ మహిళకు తెలిపారు. మనీల్యాండరింగ్ ద్వారా కోటిన్నర అకౌంట్లో పడినట్లు కూడా ఆ కాలర్ బెదిరించారు. అయితే వెరిఫికేషన్ కోసం గవర్నమెంట్ అకౌంట్లలోకి డబ్బుల్ని ట్రాన్స్ఫర్ చేయాలని ఆ మహిళను బెదిరించారు. లేదంటే అరెస్టు చేస్తామన్నారు. భయపడిన ఆ మహిళ.. నవంబర్ 23వ తేదీ నుంచి డిసెంబర్ 3వ తేదీ వరకు తన సేవింగ్స్ ఖాతాలో ఉన్న 30 లక్షలు ట్రాన్స్ఫర్ చేసింది.