న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ టీఎంసీ ఎంపీ మహువా మొయిత్ర సోమవారం లోక్ సభలో బీజేపీపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. గత లోక్సభలో తనను సస్పెండ్ చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ, ‘నా నోరు మూయించాలని వారు (బీజేపీ) ప్రయత్నించారు. ప్రజలు వారి నోరు మూయించారు. దీనివల్ల వారు 63 మంది ఎంపీలను కోల్పోయారు’ అన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.