శ్రీ చైతన్యలో కరోనా కలకలం.. 60 మంది విద్యార్థులకు పాజిటివ్
శ్రీచైతన్య | బెంగళూరు: కరోనా కాస్త తగ్గుముఖం పట్టింది. దాదాపు అన్ని రాష్ట్రాల్లో విద్యా సంస్థలు ప్రారంభించారు. అయితే ఇప్పుడు విద్యాలయాలు కరోనా నిలయాలుగా మారుతున్నాయి. తాజాగా బెంగళూరులోని శ్రీచైతన్య రెసిడెన్షియల్ స్కూల్లో కరోనా కలకలం సృష్టించింది. ఏకంగా 60 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో స్కూల్‌ను వచ్చేనెల 20 వరకు మూసివేశారు.

బెంగళూరు: కరోనా కాస్త తగ్గుముఖం పట్టింది. దాదాపు అన్ని రాష్ట్రాల్లో విద్యా సంస్థలు ప్రారంభించారు. అయితే ఇప్పుడు విద్యాలయాలు కరోనా నిలయాలుగా మారుతున్నాయి. తాజాగా బెంగళూరులోని శ్రీచైతన్య రెసిడెన్షియల్ స్కూల్లో కరోనా కలకలం సృష్టించింది. ఏకంగా 60 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో స్కూల్‌ను వచ్చేనెల 20 వరకు మూసివేశారు.
ఆదివారం సాయంత్రం శ్రీ చైతన్య విద్యా సంస్థకు చెందిన ఓ విద్యార్థి వామ్టింగ్ చేసుకున్నట్లు, డైయేరియాతో ఇబ్బందిపడుతున్నట్లు తమకు ఫిర్యాదు అందిందని బెంగళూరు అర్బన్ డిప్యూటీ కమిషనర్ మంజునాథ్ తెలిపారు. వెంటనే తారు ఆ క్యాంపస్‌లో ఉన్న మొత్తం 480 మందికి పరీక్షలు నిర్వహించామని, అందులో 60 మందికి కరోనా నిర్ధారణ అయిందని చెప్పారు.
అయితే పాజిటివ్‌గా తేలిన వారిలో ఇద్దరిలోనే లక్షణాలు ఉన్నాయని పేర్కొన్నారు. మరో వారం రోజుల తర్వాత మళ్లీ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. వైరస్ సోకినవారిలో 46 మంది కర్ణాటకు చెందినవారుకాగా, మిగిలిన 14 మంది తమిళనాడుకు చెందినవారని తెలిపారు. శ్రీచైతన్య రెసిడెన్సియల్ స్కూల్‌ను నెలరోజుల క్రితమే పునఃప్రారంభించారని వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Engilipula Batukamma | సందడిగా.. సంప్రదాయబద్ధంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు..!
ఈఎంసిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Bathukamma | జపాన్‌లో బతుకమ్మ సంబురాలు.. టోక్యోలో వెల్లివిరిసిన తెలంగాణ సంస్కృతి
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

