Vehicles Collide | చలి తీవ్రతకు ఉత్తరభారతం వణుకుతోంది (cold wave). దేశ రాజధాని ఢిల్లీ (Delhi)తోపాటు యూపీ, పంజాబ్, జార్ఖండ్, పశ్చిమబెంగాల్ సహా పలు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చలి తీవ్రత పెరిగింది. ఆయా ప్రాంతాలను దట్టమైన పొగ కమ్మేసింది (Dense fog). ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించని పరిస్థితి. ఈ క్రమంలో పొగమంచు కారణంగా ఢిల్లీ – లఖ్‌నవూ జాతీయ రహదారిపై అరడజనుకుపైగా వాహనాలు ఒకదానికొకటి ఢీ కొన్నాయి (Vehicles Collide).
శుక్రవారం ఉదయం ఢిల్లీ – ఎన్సీఆర్ ప్రాంతాన్ని దట్టమైన పొగమంచు కమ్మేసింది. ఫలితంగా దృశ్యమానత దారుణంగా పడిపోయింది. కొన్ని ఏరియాల్లో విజిబిలిటీ జీరోగా నమోదైంది. ఈ కారణంగా ముందు వెళ్తున్న వాహనాలు కనిపించని పరిస్థితి. ఫలితంగా ఇవాళ ఉదయం ఢిల్లీ – లఖ్‌నవూ జాతీయ రహదారిపై (Delhi – Lucknow National Highway) ఆరుకుపైగా కార్లు ఒకదానికొకటి ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఆ కార్లు పూర్తిగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడినట్లు సమాచారం. ఆ రహదారిపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రంగంలోకి దిగిన అధికారులు ట్రాఫిక్‌ను క్లియర్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
#WATCH | Hapur, UP: Several vehicles collide due to dense fog on the Delhi-Lucknow Highway near the Bahadurgarh station area.
Source: Hapur Police pic.twitter.com/kNWKvTCTZD
— ANI (@ANI) January 10, 2025
Also Read..
Air India | సింగపూర్ వెళ్తున్న విమానంలో సాంకేతిక సమస్య.. చెన్నైకి దారి మళ్లింపు
Ravichandran Ashwin | హిందీ జాతీయ భాష కాదు : రవిచంద్రన్ అశ్విన్