ముంబై, జూలై 8: మహారాష్ట్రలోని ముంబై శివారులో ఏకంగా 6 వేల కేజీల ఇనుప బ్రిడ్జిని ఎత్తుకెళ్లిపోయారు. ఈ ఘరానా దొంగతనానికి సంబంధించి నలుగురిని అరెస్టు చేసినట్టు పోలీసులు శనివారం వెల్లడించారు.
కాలువపై ఓ కంపెనీ తన అవసరాల నిమిత్తం 90 అడుగుల పొడవుతో ఓ ఇనుప బ్రిడ్జి నిర్మించింది. శాశ్వత వంతెన నిర్మించిన తర్వాత, దీన్ని వేరే ప్రాంతానికి తరలించింది. ఇది జూన్ 26న కనిపించకుండా పోవడంతో.. యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. గ్యాస్ కటింగ్ మెషిన్లతో ఇనుప బ్రిడ్జిని ముక్కలుగా కట్ చేసి దొంగిలించుకుపోయినట్టు సీసీటీవీ ఫుటేజీ ద్వారా గుర్తించారు.