Mumbai | పాదచారులపైకి దూసుకెళ్లిన బస్సు.. ఆరుగురు దుర్మరణం
మహారాష్ట్ర రాజధాని ముంబైలో (Mumbai) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముంబైలోని కుర్లాలో మున్సిపల్ కార్పొరేషన్‌కు (BMC) చెందిన బెస్ట్ (BEST) బస్సు అదుపుతప్పి పాదచారులపైకి దూసుకెళ్లింది. దీంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 25 మంది గాయపడ్డారు.
ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలో (Mumbai) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముంబైలోని కుర్లాలో మున్సిపల్ కార్పొరేషన్‌కు (BMC) చెందిన బెస్ట్ (BEST) బస్సు అదుపుతప్పి పాదచారులపైకి దూసుకెళ్లింది. దీంతో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 49 మంది గాయపడ్డారు. సోమవారం రాత్రి కుర్లా నుంచి అంధేరికి వెళ్తున్న బెస్ట్ బస్సు బుద్ధ కాలనీ వద్ద బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. దీంతో అది పాదచారులు, కొన్ని వాహనాలపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురు హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగ్రాతులను దవాఖానకు తరలించారు.

అనంతరం డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకోని విచారణ చేపట్టామని.. బ్రేక్ ఫెయిల్ కావడంతోనే బస్సుపై అతడు నియంత్రణ కోల్పోయాడని చెప్పారు. కాగా, బస్సును అతివేగంతో నడిపినట్లు స్థానికులు తెలిపారు. 49 మంది క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ప్రమాదానికి కారణమైన బస్సు కొత్తదేనని, మూడు నెలల క్రితమే రిజిస్ట్రేషన్ అయిందని ప్రాంతీయ రవాణా అధికారి (RTO) పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
#WATCH | Mumbai: Visuals from the accident spot in Kurla where a BEST bus lost control yesterday and rammed into multiple vehicles, killing 4 people and injuring 25 pic.twitter.com/jPHVFww1e6
— ANI (@ANI) December 10, 2024
#WATCH | Mumbai: 3 people died and 20 injured after an intracity bus going from Kurla to Andheri crushed several vehicles and people on the road. https://t.co/Jsg7RWPghN pic.twitter.com/LxduF025Ro
— ANI (@ANI) December 9, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సహకార సంఘాల బలోపేతానికి బీఆర్ఎస్ సహకారం : కేటీఆర్
Plague Disease | ప్లేగు వ్యాధిలో అసలు ఎన్ని రకాలు ఉన్నాయి.. ఈ వ్యాధి ఎలా వస్తుంది..?
PM Modi | కెనడాలో పర్యటించనున్న ప్రధాని మోదీ.. డిసెంబర్ 11, 12 తేదీల్లో షెడ్యూల్ ఖరారు
Vijay TVK | ఇండియా బ్లాక్ నిరసనల్లో చేరనున్న విజయ్ టీవీకే పార్టీ.. వెల్లడించిన వీసీకే నేత
ఇంత చేతకాని సీఎం ఎవరైనా ఉంటారా? : మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

