చెన్నై: తమిళనాడులోని తిరునల్వేలీలో భారీ ప్రాణ నష్టం తప్పింది. పట్టణంలోని నార్త్ కార్ స్ట్రీట్లో ఓ తోపుడు బండిలో ఉన్న గ్యాస్ సిలిండర్ (Cylinder Blast) పేలింది. దీంతో అక్కడ పనిచేస్తున్న వ్యక్తితోపాటు మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. భారీ శబ్దంతో సిలిండర్ పేలిపోవడంతో ఒక్కసారిగా అంతా ఉలిక్కిపడ్డారు. పేలుడు ధాటికి ఆ తోపుడుబండి తునాతునకలైంది.
భారీగా మంటలు చెలరేగడంతో రెండు దుకాణాలు కాలి బూడిదైపోయాయి. గాయపడినవారిని స్థానికులు హుటాహుటిన దవాఖానకు తరలించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. కాగా, ప్రమాదం జరిగిన సమయంలో ఆ టిఫిన్ సెంటర్ వద్ద పెద్దగా జనం లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని పోలీసులు తెలిపారు. అయితే పేలుడుకు గల కారణాలు తెలియరాలేదని చెప్పారు.
#WATCH | Tirunelveli, Tamil Nadu: 6 people were injured and 2 nearby shops gutted in the fire as a gas cylinder exploded at a shop in Tirunelveli yesterday
(Viral video confirmed by Police) pic.twitter.com/kk1xpws165
— ANI (@ANI) May 31, 2024