57 ఏండ్ల వయసులో పది పాసైన ఆశా వర్కర్
ఆశా వర్కర్ | చిన్నతనంలోనే పెళ్లి.. అంతంత మాత్రం చదువు.. ఇద్దరు పిల్లలు పుట్టగానే భర్త మృతి.. స్కూల్లో వంట చేస్తూ అరకొర జీతంతో పిల్లలను

భువనేశ్వర్ : చిన్నతనంలోనే పెళ్లి.. అంతంత మాత్రం చదువు.. ఇద్దరు పిల్లలు పుట్టగానే భర్త మృతి.. స్కూల్లో వంట చేస్తూ అరకొర జీతంతో పిల్లలను పోషిస్తున్న ఓ మహిళకు ఆశా వర్కర్ ఉద్యోగం వరించింది. కానీ ఆ ఉద్యోగంలో కొనసాగాలంటే టెన్త్ కచ్చితంగా పాస్ అయి ఉండాలన్న నిబంధనను ప్రభుత్వం తీసుకొచ్చింది. దీంతో సదరు మహిళ 57 ఏండ్ల వయసులో పది పాసై అందరికీ ఆదర్శంగా నిలిచింది.
ఒడిశా భద్రక్ జిల్లాలోని కాంతిగన్ గ్రామానికి చెందిన స్వర్ణలత ఏడో తరగతి వరకు మాత్రమే చదివింది. ఆమెకు అప్పుడే వివాహమైంది. దీంతో విద్యకు దూరం కావాల్సి వచ్చింది. ఇద్దరు పిల్లలు కలిగిన తర్వాత 27 ఏండ్ల వయసులో భర్తను కోల్పోయింది. జాబ్ కోసం ఏ కంపెనీ చుట్టూ తిరిగిన ఆమెకు విద్యార్హత లేకపోవడంతో ఉద్యోగం దొరకలేదు. ఈ క్రమంలో ఆమె సొంత గ్రామంలోని పాఠశాలలో వంట మనిషిగా ఉపాధి దొరికింది. నెలకు రూ. 100 జీతంగా వచ్చేది. ఆ సంపాదనతోనే కుటుంబాన్ని పోషించేది. 2005లో స్వర్ణలత ఆశా వర్కర్‌గా నియామకమైంది. ఆశా వర్కర్‌గా విధులు సమర్థవంతంగా నిర్వర్తించినందుకు జిల్లా స్థాయిలో ఆమెను ఎన్నో అవార్డులు వరించాయి. పిల్లలను పీజీ స్థాయి వరకు చదివించింది.
మళ్లీ పుస్తకాలతో కుస్తీ
ఇక 2019లో ఒడిశా ప్రభుత్వం కొత్త నిబంధన తీసుకొచ్చింది. ఆశా వర్కర్లుగా కొనసాగాలంటే కచ్చితంగా పదో తరగతి పాస్ కావాలన్న నిబంధన విధించింది. దీంతో స్వర్ణలత మళ్లీ పుస్తకాలతో కుస్తీ పట్టాల్సి వచ్చింది. పాఠశాలలో వంట మనిషిగా, గ్రామానికి ఆశా వర్కర్‌గా కొనసాగుతూనే.. పదో తరగతి పరీక్షలకు ఆమె సిద్ధమైంది. 2019, డిసెంబర్లో ఓపెన్ టెన్త్ ఎగ్జామ్స్‌కు ఫీజు కట్టింది. 2020, మార్చిలో ఎగ్జామ్స్ నిర్వహించాల్సి ఉండగా, కరోనా కారణంగా వాయిదా పడ్డాయి. అదే ఏడాది సెప్టెంబర్‌లో నిర్వహించిన ఎగ్జామ్స్‌లో ఫెయిల్ అయ్యింది. ఇంగ్లీష్ సబ్జెక్టులో పాస్ మార్కులకు నాలుగు మార్కులు తక్కువగా రావడంతో పాస్ కాలేదు. అయితే ఈ ఏడాది కూడా కరోనా ఉధృతి కారణంగా పరీక్షలు నిర్వహించకుండా.. అందర్నీ పాస్ చేస్తున్నట్లు ఒడిశా ప్రభుత్వం ప్రకటించింది. దీంతో స్వర్ణలత పదో తరగతి పాస్ అయింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్‌లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

