న్యూఢిల్లీ : సైన్యంలో పనిచేసిన ఆ జవాన్‌కు చదువుపై ఆసక్తి తగ్గలేదు. డిగ్రీలు, డిప్లొమాలు, సర్టిఫికెట్లు.. ఇలా 138 వరకు అందుకున్నాడు. అత్యధిక విద్యార్హతలు సాధించిన వ్యక్తిగా రికార్డులు నెలకొల్పాడు. అతడే రాజస్థాన్‌కు చెందిన మాజీ సైనికుడు దశరథ్‌సింగ్.
ఝున్‌ఝున్ జిల్లా ఖిరోడ్ గ్రామానికి చెందిన 55 ఏండ్ల దశ్థ్స్రింగ్ 1988లో ఆర్మీలో చేరి 16 సంవత్సరాలపాటు పనిచేసిన ఆయన, తన చదువు అసంపూర్ణంగా ఉందని ఎప్పుడూ భావించేవారట. ఉద్యోగ విరమణ తర్వాత తొలుత బీకామ్ డిగ్రీ, రెగ్యులర్‌గా ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం, బీఎడ్.. తదితర కోర్సులు పూర్తిచేశారట. ఇప్పటివరకు ఆయన మూడు పీహెచ్‌డీలు, ఏడు డిగ్రీలు, 46 పీజీలు, 23 డిప్లొమాలు, సైనిక అధ్యయనాలకు సంబంధించి ఏడు డిగ్రీలు, వివిధ సబ్జెక్టుల్లో 52 సర్టిఫికెట్లు సంపాదించారు.