Traffic Violations | న్యూఢిల్లీ: ఢిల్లీలో ట్రాఫిక్ నిర్వహణను మెరుగుపర్చడంతోపాటు ట్రాఫిక్ ఉల్లంఘనలకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు సరికొత్త పథకం ప్రకటించారు. ట్రాఫిక్ ఉల్లంఘనలపై ఫిర్యాదు చేసినవారికి రూ.50 వేలు నజరానాగా ఇవ్వనున్నట్టు తెలిపారు.
సెప్టెంబర్ 1 నుంచే ఇది అందుబాటులోకి వచ్చింది. ఇందుకోసం ‘ట్రాఫిక్ ప్రహారీ’ యాప్లో ట్రాఫిక్ ఉల్లంఘనుల ఫొటోలు, వీడియోలు, వాహనం రిజిస్ట్రేషన్ నంబర్ తదితర సమగ్ర వివరాలు అప్లోడ్ చేయాలి.
లక్నో: మనిషి ప్రాణాల కన్నా డబ్బుకే ఎక్కువ విలువ ఇచ్చే దురాశపరుడి వల్ల ఓ వ్యక్తి గంగా నదిలో మునిగి, ప్రాణాలు కోల్పోయారు. మీడియా కథనాల ప్రకారం, ఉత్తరప్రదేశ్ ఆరోగ్య శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఆదిత్య వర్ధన్ సింగ్ ఆదివారం తన మిత్రులతో కలిసి ఉన్నావ్లోని నానామావ్ ఘాట్ వద్ద గంగా నదిలో స్నానం చేసేందుకు వెళ్లారు. అనుకోకుండా ప్రవాహం పెరగడంతో ఆయన నీటిలో మునిగిపోయారు.
అక్కడే ఉన్న గజ ఈతగాడు సునీల్ కాశ్యప్ సహాయపడటానికి ముందుకు వచ్చాడు. అయితే ఆన్లైన్లో రూ.10,000 తనకు బదిలీ అయ్యే వరకు తాను ఆయనను కాపాడబోనని చెప్పాడు. సింగ్ నదిలో కొట్టుకుపోతూ ఉంటే, రూ.10,000 తనకు బదిలీ అయ్యే వరకు సునీల్ వేచి చూశాడు. దీంతో ఆయన నదిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు.