న్యూఢిల్లీ : న్యాయస్థానాల్లో వేలాది పెండింగ్ కేసుల వల్ల బాలలు కూడా అల్లాడుతున్నారని ఇండియా జస్టిస్ రిపోర్ట్ నివేదిక వెల్లడించింది. నెమ్మదిగా కదులుతున్న న్యాయ వ్యవస్థ కారణంగా 50 వేలకు పైగా పిల్లలు నిర్బంధంలోనే గడుపుతున్నారని వెల్లడించింది. సగానికి పైగా కేసులు 362 జువైనల్ జస్టిస్ బోర్డు (జేజీబీ)ల వద్ద పెండింగ్లో ఉన్నట్టు వెల్లడించింది.
బాల న్యాయ చట్టం అమలులోకి వచ్చి 10 ఏండ్లయినప్పటికీ న్యాయమూర్తులు తగు సంఖ్యలో లేకపోవడం, గృహాల తనిఖీ లేకపోవడం, అస్తవ్యస్త డాటా నిర్వహణ, రాష్ట్ర స్థాయిలో విస్తృత అసమానతలు వంటి కారణాల వల్ల బాలలకు న్యాయం అందజేతపై గణనీయమైన ప్రభావం చూపుతున్నాయని ఈ నివేదిక వెల్లడించింది.