చెన్నై: తమిళనాడు(TamilNadu)లోని దక్షిణ ప్రాంత జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. అయితే టూటికోరిన్ జిల్లాలోని శ్రీవైకుంఠం రైల్వే స్టేషన్లో ఓ ప్యాసింజెర్ రైలు చిక్కుకున్నది. ఆ స్టేషన్కు ఇరు వైపులా వర్షపు నీరు నిలిచిపోవడంతో ప్రయాణికుల పరిస్థితి దయనీయంగా మారింది. పట్టాలు డ్యామేజ్ కావడంతో.. ప్యాసింజెర్ రైలు ఎటూ వెళ్లలేకపోయింది. వరద వల్ల భూమి కొట్టుకుపోవడంతో రైల్వే ట్రాక్లు వేలాడుతున్నాయి. ఇనుప పట్టీలు కేవలం సిమెంట్ శ్లాబులపై మాత్రమే ఉన్నాయి. రైల్వే స్టేషన్ దారిలో ఉన్న రోడ్డు కూడా కొట్టుకుపోవడంతో ప్రస్తుతం రెస్క్యూ పనులు నిలిచిపోయాయి. తిరుచెండూరు నుంచి చెన్నై వెళ్తున్న రైలు ఆ స్టేషన్లో చిక్కుకున్నది. ప్రస్తుతం ప్రయాణికులు అంతా సురక్షితంగా ఉన్నారని, ఎన్డీఆర్ఎఫ్ దళాలు అక్కడకు వెళ్లేందుకు ట్రై చేస్తున్నారని, హెలికాప్టర్ల ద్వారా ఆహారాన్ని జారవిడిచేందుకు ఏర్పాటు జరుగుతున్నాయని దక్షిణ రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో వర్షం ఆగినా.. డ్యామ్ల నుంచి నీటిని రిలీజ్ చేయడం వల్ల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. కన్యాకుమారి, తూత్తుకుడి, టెంకాశీ, తిరునెల్వెల్లి జిల్లాల్లో భీకరంగా వర్షాలు పడుతున్న విషయం తెలిసిందే.
All trains starting from Tirunelveli have been cancelled. #TamilNadu pic.twitter.com/6mJF67du7H
— All India Radio News (@airnewsalerts) December 18, 2023