SRH vs RR | రాజస్థాన్‌కు షాక్.. ఉత్కంఠ పోరులో సన్‌రైజర్స్ విజయం..
SRH vs RR | సొంతగడ్డపై జరిగిన ఉత్కంఠ పోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించింది. 202 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ 200 పరుగుల వద్దే పరిమితమైంది. పరాగ్, జైస్వాల్ హాఫ్ సెంచరీలతో మెరిసినప్పటికీ.. సన్‌రైజర్స్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో మిగిలిన బ్యాటర్లు విఫలమయ్యారు. చివరలో పొవెల్ రాజస్థాన్‌ను విజయతీరాలకు చేర్చే ప్రయత్నం చేసినప్పటికీ.. చివరి బంతికి ఎల్బీడబ్ల్యూ కావడంతో ఓటమి తప్పలేదు.
SRH vs RR | సొంతగడ్డపై జరిగిన ఉత్కంఠ పోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించింది. రాజస్థాన్‌పై ఒక్క పరుగు తేడాతో గెలుపొందింది. 202 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి 200 పరుగుల వద్దే పరిమితమైంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పరాగ్, జైస్వాల్ హాఫ్ సెంచరీలు వృథా అయ్యాయి. చివరలో పొవెల్ రాజస్థాన్‌ను విజయతీరాలకు చేర్చే ప్రయత్నం చేసినప్పటికీ.. చివరి బంతికి ఎల్బీడబ్ల్యూ కావడంతో ఓటమి తప్పలేదు.
ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్‌తో రికార్డు సృష్టించిన హైదరాబాద్ ఆటగాళ్లను రాజస్థాన్ రాయల్స్ బౌలర్లు ఆది నుంచి కట్టడి చేశారు. దీంతో పవర్ ప్లే ముగిసేసరికి రెండు వికెట్ల నష్టానికి 37 పరుగుల వద్దే పరిమితమైంది. ఐదో ఓవర్లో అవేశ్ ఖాన్ వేసిన తొలి బంతికి షాట్ ఆడేందుకు ప్రయత్నించి అభిషేక్ (12) ఔటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన అన్మోల్ప్రీత్(5) తొలి బంతికే ఫోర్ బాదాడు. కానీ ఆరో ఓవర్లో సందీప్ శర్మ వేసిన బంతికి జైస్వాల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
రాజస్థాన్ బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్ చేయడంతో రెండు కీలక వికెట్లను కోల్పోయిన సన్‌రైజర్స్ కాసేపు నిలకడగా ఆడింది. కానీ 9వ ఓవర్ నుంచి ట్రావిస్ హెడ్ (58) దూకుడు పెంచాడు. అతనికి నితీశ్‌రెడ్డి జత కలిశాడు. దీంతో ఇద్దరూ కలిసి చెరో హాఫ్ సెంచరీతో జట్టుకు కీలకమైన స్కోర్ అందించారు. అయితే అవేశ్ ఖాన్ వేసిన 15వ ఓవర్లో మూడో బంతికి స్టంపౌట్ నుంచి తప్పించుకున్నప్పటికీ.. నాలుగో బంతికి హెడ్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. హెడ్ ఔటవ్వడంతో క్రీజులోకి వచ్చిన క్లాసెస్ (40) కూడా రాణించాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి జట్టు స్కోర్‌ను ఎట్టకేలకు 200 దాటించారు. రాజస్థాన్ ముందు 202 పరుగుల లక్ష్యాన్ని ఉంచారు.
టార్గెట్ చేధనలో భాగంగా బరిలోకి దిగిన రాజస్థాన్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. తొలి ఓవర్లోనే రెండు కీలక వికెట్లను కోల్పోయింది. భువనేశ్వర్ వేసిన మొదటి ఓవర్లో రెండో బంతిని ఎదుర్కొన్న బట్లర్ (0) జాన్సెన్కు క్యాచ్ ఇచ్చాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన సంజూ శాంసన్ (0) క్లీన్‌బౌల్డ్ అయి పెవిలియన్ చేరారు. కానీ ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రియాన్ పరాగ్ (77), ఓపెనర్ జైస్వాల్(67)తో కలిసి విజృంభించాడు. పవర్ ప్లేలోపే వీళ్లిద్దరూ ఔటవ్వాల్సింది కానీ రెండు సందర్భాల్లోనూ క్యాచ్ మిస్సవ్వడం వీరికి కలిసొచ్చింది.
జాన్సెన్ వేసిన నాలుగో ఓవర్లో తొలి బంతిని జైస్వాల్ ఎదుర్కోగా.. కెప్టెన్ కమిన్స్ క్యాచ్ డ్రాప్ చేశాడు. నటరాజన్ వేసి ఆరో ఓవర్లో ఐదో బంతిని పరాగ్ ఎదుర్కోగా.. అభిషేక్ క్యాచ్ డ్రాప్ చేశాడు. దీంతో ఔట్ నుంచి తృటిలో తప్పించుకున్న పరాగ్, జైస్వాల్ ఇద్దరూ చెరో హాఫ్ సెంచరీతో చెలరేగి ఆడారు. కానీ నటరాజన్ బౌలింగ్‌లో 14వ ఓవర్లో మూడో బంతికి జైస్వాల్ బౌల్డ్ అయ్యాడు. కమిన్స్ వేసిన 16వ ఓవర్లో పరాగ్ పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత పరుగుల వేటలో రాజస్థాన్ వెనుకబడింది. పరాగ్ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన హెట్మెయిర్ (13), ధ్రువ్ జురెల్ (1) ఎక్కువసేపు క్రీజులో నిలబడలేకపోయాడు. చివరలో పొవెల్ రాణించినప్పటికీ లాభం లేకుండా పోయింది. 2 బంతుల్లో 4 పరుగులు చేయాల్సి ఉండగా.. భువనేశ్వర్ వేసిన 19.5 ఓవర్లో రెండు పరుగుల కోసం ప్రయత్నించి రనౌట్ కావాల్సింది తృటిలో తప్పించుకున్నాడు. ఇక చివరి బంతికి రెండు పరుగులు చేయాల్సి ఉండగా.. పొవెల్ ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. దీంతో ఒక్క పరుగు తేడాతో సన్‌రైజర్స్ విజయం సాధించింది. హైదరాబాద్ బౌలర్లలో భువనేశ్వర్ 3 వికెట్లు పడగొట్టాడు. నటరాజన్ , కమిన్స్ చెరో 2 వికెట్లు తీశారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
MBA student dies | పరీక్షకు ముందు యూనివర్సిటీ భవనం పైనుంచి దూకి.. ఎంబీఏ విద్యార్థిని మృతి
ఉద్యోగుల సుదీర్థ సేవలు సంస్థకు చిరస్మరణీయం : ఎస్ ఓ టు జీఎం ఎం.గోవిందరావు
DK Aruna | భూములు అమ్మి రాష్ట్రాన్ని నడుపుతారా.. సీఎం రేవంత్ రెడ్డిపై డీకే అరుణ ఫైర్!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

