అహ్మదాబాద్/ముంబై, అక్టోబర్ 8: ముంబైలో రూ.500 కోట్ల విలువైన కొకైన్‌ను ది డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు పట్టుకున్నారు. నవీ ముంబై సమీపంలోని శేవా పోర్టులో 50 కిలోల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. దక్షిణాఫ్రికా నుంచి గ్రీన్ ఆపిల్ పండ్ల కంటైనర్‌లో తీసుకొస్తుండగా దాడిచేసి పట్టుకున్నామని అధికారులు తెలిపారు. మరోవైపు, గుజరాత్ తీరంలో 50 కిలోగ్రాముల హెరాయిన్‌ను ఇండియన్ కోస్ట్‌గార్డ్, గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్కాడ్ అధికారులు పట్టుకున్నారు. దీని విలువ సుమారు రూ. 350 కోట్లు ఉంటుందని తెలిపారు. పాకిస్థాన్ నుంచి బోటులో వస్తుండగా గుర్తించి ఐదు గన్నీ బ్యాగుల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నామని, ఆరుగురు పాకిస్థానీ స్మగ్లర్లను అరెస్ట్ చేసినట్టు అధికారులు వెల్లడించారు.