జింద్: ‘డంకీ’ మార్గంలో అమెరికాలోకి ప్రవేశించిన సుమారు 50 మంది హర్యానా యువకులను ఆ దేశ ప్రభుత్వం దేశ బహిష్కరణ చేసింది. దీంతో వీరంతా విమానంలో ఢిల్లీకి చేరుకొని అక్కడి నుం చి స్వస్థలాలకు వచ్చారు. వీరిలో నరేశ్ కుమార్ అనే యువకుడు మాట్లాడుతూ తనను అమెరికా పంపిన ఏజెంట్‌కు రూ.57 లక్షలు చెల్లించాలని వాపోయాడు. ఆ ఏజెంట్‌పై చర్యలు తీసుకోవాలని పోలీసులకు విజ్ఞప్తి చేశాడు. ఎవరూ డంకీ మార్గం ద్వారా అమెరికాకు వెళ్లొద్దన్నాడు.