న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ కారులో ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన అయిదుగురు వ్యక్తులు మృతిచెందారు. బులంద్‌షెహర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. బుదౌన్‌లో జరిగిన పెళ్లి వేడుకకు వెళ్లి.. తిరిగి వస్తున్న క్రమంలో దుర్ఘటన చోటుచేసుకున్నది. హైవేపై ఉన్న కల్వర్ట్ను కారు ఢీకొన్నదని, ఆ తర్వాత ఓవర్‌టర్న్ తీసుకుని, మంటలు అంటుకున్నట్లు పోలీసులు చెప్పారు. డ్రైవర్ నిద్రమత్తులోకి వెళ్లడం వల్ల ప్రమాదం జరిగిందని పోలీసులు వెల్లడించారు. బుధవారం తెల్లవారుజామున 5.30 నిమిషాలకు జానిపుర్ గ్రామ సమీపంలో ఈ ఘటన జరిగినట్లు అదనపు ఎస్పీ తేజ్వీర్ సింగ్ చెప్పారు.
కల్వర్ట్ను ఢీకొని, కారుకు నిప్పు అంటుకున్న విషయాన్ని స్థానికులు పోలీసులకు చేరవేశారు. తక్షణమే స్థానిక పోలీసులతో పాటు అగ్నిమాపక సిబ్బంది అక్కడకు వెళ్లింది. రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. గుల్నాజ్ అనే 28 ఏళ్ల వ్యక్తి ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డాడు. బుదౌన్ జిల్లాలో జరిగిన వెడ్డింగ్‌కు వెళ్లి.. రిటర్న్ అవుతున్న సమయంలో ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక విచారణ ద్వారా తెలిసినట్లు పోలీసులు చెప్పారు. మృతదేహాలను పోస్టుమార్టమ్‌కు పంపారు.
#बुलंदशहर:-शादी से लौट रही कार पुलिया से टकराकर जलकर खाक, भीषण हादसे में 5 लोगों की मौत, 1 महिला गंभीर घायल।
कार सवार बदायूं से दिल्ली जा रहे थे। हादसा जहांगीराबाद क्षेत्र के जानीपुर चंदौस के पास हुआ। पुलिस ने शवों को पोस्टमार्टम के लिए भेजा, घायल को अस्पताल में भर्ती कराया।… pic.twitter.com/x9Xn6wMbTw
— UttarPradesh.ORG News (@WeUttarPradesh) June 18, 2025