గడ్చిరోలి : మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో భీకరమైన ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. శనివారం ఉదయం గ్యారపట్టి అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తోన్న పోలీసు బలగాలకు, మావోయిస్టులు తారసపడ్డారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. ప్రస్తుతం మావోయిస్టులకు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. గ్యారపట్టి అటవీ ప్రాంతాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.