డెహ్రాడూన్: ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పింది. లోయలోకి దూసుకెళ్లి బోల్తాపడింది. (bus overturns) ఈ ప్రమాదంలో నలుగురు మరణించారు. 17 మంది గాయపడ్డారు. పోలీసులు, అధికారులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఉత్తరాఖండ్‌లోని పౌరి గర్హ్వాల్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఆదివారం ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లింది. శ్రీనగర్ ప్రాంతంలోని దహల్చోరి దగ్గర కొండ దిగువన వంద మీటర్ల దూరంలో అది బోల్తాపడింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రయాణికులు మరణించారు. 17 మంది గాయపడ్డారు.
కాగా, ఈ ప్రమాదం గురించి తెలిసిన వెంటనే పౌరి గర్వాల్ జిల్లా అధికారులు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికులతో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.