న్యూఢిల్లీ: టెక్ సెక్టార్లో ఉద్యోగాల కోతలు కొనసాగుతున్నాయి. మైక్రోసాఫ్ట్‌కు చెందిన ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ ప్లాట్‌ఫామ్ లింక్డ్ఇన్ 5 శాతం ఉద్యోగులను ఇంటికి పంపేందుకు సిద్ధమైంది. ప్రపంచవ్యాప్తంగా లింక్డ్ఇన్లో 17,500 మందికిపైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు.
సంస్థ పునర్వ్యస్థీకరణలో భాగంగా ఈ కోతలు చేపడుతున్నట్టు కంపెనీ వర్గాలు తెలిపాయి. మార్క్ జుకర్‌బర్గ్‌కి చెందిన మెటా కూడా వచ్చే కొద్ది నెలల్లో 16 వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన పలుకనుంది. తొలిదశలో భాగంగా ఈ నెల 20 నుంచి 8 వేల మందిని ఇంటికి పంపనుంది. ఈ ఏడాది ఇప్పటివరకు 1,03,000 మంది టెక్ ఉద్యోగులపై వేటు పడింది.