ఐజ్వాల్, అక్టోబర్ 10: మిజోరంలో ఐదుగురు స్వతంత్ర ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. వీరంతా జోరాం పీపుల్స్ మూవ్‌మెంట్‌కు చెందినవారు. 2018 ఎన్నికల్లో ఈ రాజకీయ పార్టీ రిజిస్టర్ కాకపోవడంతో వీరు స్వతంత్రులుగా పోటీ చేసి గెలిచారు. నవంబరు 7న జరిగే శాసనసభ ఎన్నికల్లో ఈ పార్టీ తరపున పోటీ చేయడం కోసం ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసినట్లు వీరు తెలిపారు. ఇటీవల కాంగ్రెస్ ఎమ్మెల్యే కేటీ రోక్షా రాజీనామా చేసి అధికార ఎంఎన్‌ఎఫ్‌లో చేరారు.