Odisha | భువనేశ్వర్ : ఒడిశాలో ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న కల్వర్టు కూలి ఐదుగురు మృతి చెందారు. మృతుల్లో నలుగురు చిన్నారులు ఉన్నారు.
వివరాల్లోకి వెళ్తే.. రాయగడ జిల్లాలోని ఉపరసజ గ్రామ సమీపంలో ఓ కల్వర్టు నిర్మిస్తున్నారు. అయితే సోమవారం ఉదయం కొంత మంది పిల్లలు స్నానాలు చేసేందుకు ఆ కల్వర్టు వద్దకు వెళ్లారు. పిల్లలు స్నానాలు చేస్తుండగా, ప్రమాదవశాత్తు కల్వర్టు కుప్పకూలిపోయింది. మొత్తం ఐదుగురు మృతి చెందారు. మృతుల్లో నలుగురు పిల్లలు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. శిథిలాల కింద ఉన్న మృతదేహాలను పోలీసులు వెలికితీశారు. మృతుల నివాసాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.