Mouth Freshener | రెస్టారెంట్లో మౌత్‌ఫ్రెష్‌నర్ తిని అస్వస్థత.. వాంతులు, నోట్లో రక్తం రావడంతో ఆసుపత్రిలో చేరిక
Mouth Freshener | ఓ రెస్టారెంట్లో డిన్నర్ చేసిన ఐదుగురికి ఊహించని అనుభవం ఎదురైంది. డిన్నర్ అనంతరం తీసుకున్న మౌత్ ఫ్రెష్నర్ (Mouth Freshener) కారణంగా వారంతా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
Mouth Freshener | ఓ రెస్టారెంట్లో డిన్నర్ చేసిన ఐదుగురికి ఊహించని అనుభవం ఎదురైంది. డిన్నర్ అనంతరం తీసుకున్న మౌత్ ఫ్రెష్నర్ (Mouth Freshener) కారణంగా వారంతా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, నోటి నుంచి రక్తం రావడంతో ఆసుపత్రిలో చేరారు. ఈ ఘటన హర్యాణా రాష్ట్రంలోని గురుగ్రామ్‌లో (Gurugram Cafe) చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. గ్రేటర్ నోయిడాకు చెందిన అంకిత్ కుమార్ అనే వ్యక్తి భార్య, స్నేహితులతో కలిసి గురుగ్రామ్ సెక్టార్ 90లోని లాఫోరెస్టా కేఫ్ ( Laforestta Cafe) కు వెళ్లారు. అక్కడ అంతా కలిసి డిన్నర్ చేశారు. అనంతరం వెయిటర్ ఇచ్చిన మౌత్ఫ్రెష్నర్ను తీసుకున్నారు. అయితే అది తీసుకున్న కొద్దిసేపటికే వారు అస్వస్థతకు గురయ్యారు. నోట్లో మంటతో ఇబ్బంది పడ్డారు. అంతే కాకుండా కొందరికి వాంతులు అయ్యాయి. నోట్లో నుంచి రక్తం కూడా వచ్చింది. మంటను తట్టుకోలేక బాధితులు నోట్లో ఐస్ ముక్కలు వేసుకున్నారు. వెంటనే వారంతా ఆసుపత్రిలో చేరారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
మరోవైపు ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెస్టారెంట్ సిబ్బంది ఇచ్చిన మౌత్ ఫ్రెష్నర్ ప్యాకెట్‌ను వైద్యులకు చూపించినట్లు తెలిపారు. అది డ్రై ఐస్ (Dry Ice) అని.. ప్రాణాంతకమైన యాసిడ్ అని వైద్యులు తెలిపినట్లు బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.
Also Read..
Elon Musk | మస్క్ ఔట్.. ప్రపంచ కుబేరుడిగా అవతరించిన జెఫ్ బెజోస్
UP Police Exam: కానిస్టేబుల్ పరీక్ష పేపర్ లీకేజీ కేసులో రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ తొలగింపు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

