Elon Musk | మస్క్ ఔట్.. ప్రపంచ కుబేరుడిగా అవతరించిన జెఫ్ బెజోస్
Elon Musk | అమెరికన్ టైకూన్, టెస్లా అధినేత, ట్విట్టర్ బాస్ ఎలాన్ మస్క్ (Elon Musk) మరోసారి ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడి హోదాను (Worlds Richest Person ) కోల్పోయారు.
Elon Musk | అమెరికన్ టైకూన్, టెస్లా అధినేత, ట్విట్టర్ బాస్ ఎలాన్ మస్క్ (Elon Musk) మరోసారి ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడి హోదాను (Worlds Richest Person ) కోల్పోయారు. ఆయన స్థానంలో అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ (Jeff Bezos) ప్రపంచ నంబర్ 1 కుబేరుడిగా అవతరించారు.
బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ సూచీ (Bloomberg Billionaires Index) ప్రకారం.. సోమవారం నాడు టెస్లా కంపెనీ షేర్ల విలువ ఏకంగా 7.2 శాతం క్షీణించడంతో మస్క్ సంపద విలువ 197.7 బిలియన్ డాలర్లకు తగ్గింది. దీంతో 200.3 బిలియన్ డాలర్ల సంపదతో అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ ప్రపంచ సంపన్నుల జాబితా టాప్ ప్లేస్‌లోకి చేరాడు. గత 9 నెలల వ్యవధిలో ప్రపంచ సంపన్నుల జాబితాలో మస్క్ రెండో స్థానానికి పడిపోవడం ఇదే తొలిసారి.
ఇక జెఫ్ బెజోస్ 2021 తర్వాత ప్రపంచ నంబర్ 1 స్థానంలో నిలవడం ఇదే తొలిసారి. 2017లో ఆయన తొలిసారి మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌ను అధిగమించి నంబర్ 1 స్థానంలో నిలిచారు. అయితే 2021లో టెస్లా షేర్లు క్రమంగా బలపడటంతో మస్క్ సంపద అమాంతం పెరిగిపోయింది. దీంతో బెజోస్ వెనుకబడ్డారు. తిరిగి మళ్లీ ఇప్పుడే అగ్రస్థానాన్ని దక్కించుకున్నారు. మరోవైపు ఫ్రాన్స్‌కు చెందిన లగ్జరీ వస్తువుల ఉత్పత్తి లూయిస్ విట్టాన్ కంపెనీ ఎల్వీఎంహెచ్ అధినేత బెర్నార్డ్ ఆర్నాల్ట్ 197.5 బిలియన్ డాలర్ల నికర సంపదతో ప్రపంచ సంపన్నుల జాబితాలో మూడో స్థానంలో నిలిచారు.
Also Read..
Abortion | అబార్షన్ అక్కడ రాజ్యాంగ హక్కు.. చారిత్రక బిల్లును ఆమోదించిన..
Prison Radicalisation Case: ప్రిజన్ రాడికలైజేషన్ కేసులో ఏడు రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు
David Warner | టాలీవుడ్ ‘ప్రిన్స్’లా వార్నర్.. నవ్వులు పూయిస్తున్న ఇన్‌స్టా రీల్
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

