David Warner | టాలీవుడ్ ‘ప్రిన్స్’లా వార్నర్.. నవ్వులు పూయిస్తున్న ఇన్‌స్టా రీల్
David Warner : ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్(David Warner) తన ఆటతోనే కాదు ఫన్నీ డాన్స్‌లతో అభిమానులను అలరిస్తుంటాడు. కరోనా లాక్డౌన్(Lockdown) సమయంలో బాలీవుడ్, టాలీవుడ్ పాటలకు కుటుంబంతో కలిసి స్టెప్పులేసిన డేవిడ్ భాయ్.. తాజాగా మరో రీల్‌తో..
David Warner : ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్(David Warner) తన ఆటతోనే కాదు ఫన్నీ డాన్స్‌లతో అభిమానులను అలరిస్తుంటాడు. ఈ డాషింగ్ బ్యాటర్ ఇన్‌స్టాగ్రామ్స్ రీల్స్(Instagram Reels) ఎంతో పాపులర్ అని తెలిసిందే. కరోనా లాక్డౌన్(Lockdown) సమయంలో బాలీవుడ్, టాలీవుడ్ పాటలకు కుటుంబంతో కలిసి స్టెప్పులేసిన డేవిడ్ భాయ్.. తాజాగా మరో రీల్‌తో వచ్చాడు.
గతంలో అల్లు అర్జున్, బాహుబలి హీరో ప్రభావస్ రీల్స్‌తో ఫ్యాన్స్‌ను అలరించిన డేవిడ్ భాయ్ ఈసారి టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు(Mahesh Babu) గెటప్‌లో నవ్వులు పూయిస్తున్నాడు. ‘మహర్షి’ మూవీలో మహేశ్ బాబు పోషించిన రిషి కుమార్ పాత్రలో వార్నర్ కనిపించాడు. ఈ రీల్‌కు అతడు అద్భుతమైన సినిమా. మీరు దీన్ని గుర్తు పెట్టుకున్నారా అని క్యాప్షన్ పెట్టాడు. ఆద్యంతం నవ్వు తెప్పిస్తున్న ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆస్ట్రేలియా గొప్ప బ్యాటర్లలో ఒకడైన వార్నర్.. మూడు ఫార్మట్లలో 100 మ్యాచులు ఆడిన తొలి ఆసీస్ క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పాడు. మొత్తంగా ఈ ఫీట్ సాధించిన మూడో ఆటగాడిగా డేవిడ్ భాయ్ గుర్తింపు సాధించాడు. హాబర్ట్లో వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన వార్నర్.. పొట్టి ఫార్మాట్లో 100వ మ్యాచ్ పూర్తి చేసుకున్నాడు.
వార్నర్ కంటే ముందు భారత రన్ మెషిన్ విరాట్ కోహ్లీ(Virat Kohli), న్యూజిలాండ్ దిగ్గజం రాస్ టేలర్(Ross Taylor)లు ఈ ఫీట్ సాధించారు. వార్నర్ ఇప్పటివరకూ 112 టెస్టలు, 161 వన్డేలు ఆడాడు. ఈ ఏడాది స్వదేశంలో పాకిస్థాన్‌తో టెస్టు సిరీస్ అనంతరం ఈ లెఫ్ట్ హ్యాండర్ సుదీర్ఘ ఫార్మాట్‌తో పాటు వన్డేలకూ వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే.

ఓపెనర్‌గా పలు రికార్డులు..
నాలుగు ఐసీసీ ట్రోఫీలు గెలిచిన ఆసీస్ జట్టులో సభ్యుడైన వార్నర్ ఓపెనర్‌గా పలు రికార్డులు నెలకొల్పాడు. టెస్టులు, వన్డేలు, టీ20ల్లో అత్యధిక శతకాలు బాదిన తొలి ఓపెనర్‌గా వార్నర్ చరిత్ర సృష్టించాడు. భారత లెజెండ్ సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar) రికార్డును బద్దలు కొట్టాడు. వార్నర్ 49 సెంచరీలతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. సచిన్ 45 శతకాలతో రెండో స్థానంలో ఉన్నాడు. ఈ లెఫ్ట్ హ్యాండర్ 451 ఇన్నింగ్స్‌ల్లో ఈ మైలురాయికి చేరుకోగా.. మాస్టర్ బ్లాస్టర్ 342 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఫీట్ సాధించాడు.
ఇవి కూడా చదవండి
- Gruha Jyothi | ఒక్కరోజు ముచ్చటేనా.. ఎన్నికల్ కోడ్ అంటూ రెండో తేదీ నుంచే సాధారణ బిల్లులు
- BRS | ఫలిస్తున్న పాజిటివ్ వైఖరి
- Police Transfers | పోలీస్ శాఖలో గందరగోళంగా బదిలీలు.. అధికారుల్లో అసహనం
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

