Police Transfers | పోలీస్ శాఖలో గందరగోళంగా బదిలీలు.. అధికారుల్లో అసహనం
ఇలా పోస్టింగ్ ఇస్తున్నారో లేదో.. అలా బదిలీ జరిగిపోతున్నది. సిబ్బంది.. శ్రేయోభిలాషులు పూల బొకేలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపేలోపే మళ్లీ బదిలీ వేటు పడుతున్నది. గతంలో ఎన్నడూ లేని విధంగా పోలీస్ శాఖలో బదిలీల వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశమవుతున్నది.
Police Transfers | సిటీబ్యూరో: ఇలా పోస్టింగ్ ఇస్తున్నారో లేదో.. అలా బదిలీ జరిగిపోతున్నది. సిబ్బంది.. శ్రేయోభిలాషులు పూల బొకేలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపేలోపే మళ్లీ బదిలీ వేటు పడుతున్నది. గతంలో ఎన్నడూ లేని విధంగా పోలీస్ శాఖలో బదిలీల వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశమవుతున్నది. వరుస బదిలీలపై అధికారులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న బదిలీలు కేవలం ఎన్నికల నియమావళి మేరకేనంటూ ఉన్నతాధికారులు చెబుతుంటే.. క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ఉంటున్నది.
ఒక అధికారిని ఒక ప్రాంతానికి బదిలీ చేసిన మరుసటి రోజే తిరిగి ఆ ఉత్తర్వులు రద్దు చేయడం, స్థానచలనం అయిన అధికారిని అదే స్థానంలో పోస్టింగ్ కల్పించడం..ఇదేక్కడి ఎన్నికల నియమావళి అంటూ కొందరు అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల నియమావళి ప్రకారం బదిలీలు చేస్తే.. సదరు అధికారికి సంబంధించిన పూర్తి వివరాల ఆధారంగానే పోస్టింగ్ కల్పిస్తారు. కానీ ఇప్పుడు జరుగుతున్న బదిలీల తంతులో ఒక అధికారిని ట్రాన్స్ఫర్ చేసి, కొత్త పోస్టింగ్ కల్పించిన వారం లోపే మళ్లీ స్థానచలనం చేయడం పలు విమర్శలకు తావిస్తున్నది.
శాంతిభద్రతలపై ప్రభావం..?
కొత్త పోస్టింగ్లు తీసుకున్న ఏసీపీలు ఆ ప్రాంతంపై పట్టు సాధించే లోపే బదిలీకావడం వల్ల స్థానికంగా శాంతిభద్రతలు పట్టు తప్పే ప్రమాదం లేకపోలేదంటున్నారు సీనియర్ అధికారులు. అలాగే ఈ మధ్య ఇన్స్పెక్టర్ స్థాయి నుంచి డీసీపీ స్థాయిల వరకు తరచూ బదిలీలు జరుగుతుండడంతో కేసుల దర్యాప్తు మందగిస్తుందనే విమర్శలూ వినిపిస్తున్నాయి.
పలువురు అధికారుల అసంతృప్తి
ఎన్నికల నియమావళిలో భాగంగా బదిలీలు చేయాలంటే సదరు అధికారికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని సేకరించి ఇందుకు అనుగుణంగా బదిలీ చేయాలి. అంతే తప్ప.. నాలుగు రోజులకోసారి అధికారులను బదిలీ చేయడం, ఒకచోట నుంచి బదిలీ చేసిన అధికారికి తిరిగి మళ్లీ అదే చోట పోస్టింగ్ కల్పించడం వంటి వ్యవహారాలపై పలువురు అధికారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

