న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5: హైదరాబాద్‌కు చెందిన ఫార్మా దిగ్గజం ‘బయలాజికల్ ఈ’ సంస్థ తయారుచేసిన కరోనా వాక్సిన్ కార్బివాక్స్‌ను కొనుగోలు చేసేందుకు కేంద్రం ఆర్డర్ ఇచ్చింది. ఒక్కో డోసు రూ.145 చొప్పున (పన్నులు కాకుండా) 5 కోట్ల డోసులు కొనుగోలు చేసేందుకు ఆ సంస్థకు ఆర్డర్ ఇచ్చినట్టు కేంద్రప్రభుత్వ వర్గాలు శనివారం తెలిపాయి. ఈ కొత్త టీకాను ఎవరికి అందజేస్తారన్నదానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు వేసే అంశంపై కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు చర్చలు జరుపుతున్నట్టు సమాచారం.