బెంగళూరు: ఒమిక్రాన్ గుర్తించిన ఇద్దరు బాధితుల్లో మొదటివ్యక్తి.. 66 ఏండ్ల దక్షిణాఫ్రికా వాసి దేశం విడిచి వెళ్లడంపై కర్ణాటక సర్కారు శుక్రవారం దర్యాప్తునకు ఆదేశించింది. ఎయిర్‌పోర్టులో పాజిటివ్‌గా ఫలితం వచ్చిన తర్వాత, మూడు రోజుల్లోనే సదరు వ్యక్తికి నెగెటివ్ రిపోర్ట్ ఎలా వచ్చిందని అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నెగెటివ్ రిపోర్టు ఇచ్చిన ప్రైవేట్ ల్యాబ్‌లో అక్రమాలు జరిగాయా? ఆ వ్యక్తి దేశం విడిచి ఎలా వెళ్లగలిగాడు? తదితర అంశాలపై దర్యాప్తు చేపట్టనున్నట్టు వెల్లడించారు. దక్షిణాఫ్రికా నుంచి వచ్చి జాడ లేకుండా పోయిన మరో పది మంది ప్రయాణికుల ఆచూకీ కోసం వెదుకుతున్నట్టు తెలిపారు.
ఏండ్ల వయసున్న ఇద్దరు బాలికలకు సీజనల్ వ్యాక్సిన్‌ను వేయడానికి బదులు కొవిషీల్డ్ టీకా వేశారు. దీంతో ఆ మైనర్లు అస్వస్థతకు గురవ్వడంతో దవాఖానలో చేర్చారు. ఈ ఘటన కేరళలోని తిరువనంతపురంలో గురువారం చోటుచేసుకున్నది. ప్రస్తుతం బాలికల పరిస్థితి నిలకడగా ఉన్నట్టు అధికారులు తెలిపారు.