అహ్మాదాబాద్: గుజరాత్లో అక్రమంగా ఉంటున్న సుమారు 450 మంది బంగ్లాదేశీ శరణార్థుల(Illegal Immigrants)ను అరెస్టు చేశారు. అహ్మదాబాద్ సిటీలో నిర్వహించిన కూంబింగ్ ఆపరేషన్ ద్వారా వీళ్లను అదుపులోకి తీసుకున్నారు. ఇవాళ తెల్లవారుజామున పోలీసులు నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో కూంబింగ్ ఆపరేషన్ చేపట్టినట్లు క్రైం బ్రాంచ్ డీసీపీ అజిత్ రాజియాన్ తెలిపారు. చాలా వరకు బంగ్లాదేశ్‌కు చెందిన శరణార్థుల్ని పట్టుకున్నామని, వాళ్లను దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఒకవేళ సరైన డాక్యుమెంట్లు లేకపోతే వాళ్లను డిపోర్ట్ చేయనున్నట్లు తెలిపారు. అహ్మదాబాద్ క్రైం బ్రాంచ్, స్పెషల్ ఆపరేషన్స్ గ్రూపు, ఎకనామిక్ అఫెన్స్ వింగ్, ఆరో జోన్‌తో పాటు హెడ్‌క్వార్టర్స్‌కు చెందిన పోలీసులు ఈ కూంబింగ్ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. కాంకరియా ఫుట్‌బాల్ గ్రౌండ్లో ఆ అక్రమ వలసదారుల్ని బంధించినట్లు తెలిపారు.
#WATCH | Ahmedabad, Gujarat: This morning, starting from 3 am, the Ahmedabad Crime Branch, along with teams from the SOG, EOW, Zone 6, and Headquarters, organised a combing operation to apprehend foreign immigrants residing illegally in Ahmedabad city. During this operation, more… pic.twitter.com/lYXvQiz0VV
— ANI (@ANI) April 26, 2025
సూరత్‌లో కూడా గత రాత్రి కూంబింగ్ ఆపరేషన్ చేపట్టారు. ఎస్ఓజీ, డీసీబీ, ఏహెచ్‌టీయూ, పీసీబీ సిబ్బంది ఆపరేషన్ నిర్వహించింది. దాదాపు వంద మందికిపైగా బంగ్లాదేశీలను అరెస్టు చేశారు. అక్రమంగా ఇండియాలోకి ప్రవేశించిన బంగ్లాదేశీలు ఫేక్ డాక్యుమెంట్లతో సూరత్‌లో నివసిస్తున్నట్లు తెలిసింది. విచారణ తర్వాత అందర్నీ బంగ్లాదేశ్‌కు పంపనున్నట్లు స్పెషల్ ఆపరేషన్స్ గ్రూపు డీసీపీ రాజ్‌దీప్ సింగ్ నాకుం తెలిపారు.
#WATCH | Surat, Gujarat | Surat city’s SOG, DCB, AHTU, PCB, and police personnel conducted a combing operation last night. They detained more than 100 Bangladeshis, all of whom entered India illegally and had been residing in Surat with fake documents for years. After… pic.twitter.com/RNJqURpE6y
— ANI (@ANI) April 26, 2025